Cumin powder

Cumin Powder : బరువు తగ్గాలనుకునే వారికి జీలకర్ర బాగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ జీలకర్ర తినడం, దాని జ్యూస్ తాగడం వల్ల బొడ్డు చుట్టూరా ఉన్న కొవ్వుతో పాటు మీ శరీరంలోని ఇతర భాగాల్లో పెరుగుతున్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనంలో భాగంగా.. ఊబకాయంతో బాధపడుతున్న 80 మంది మహిళలను రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ఒక గ్రూపువారు జీలకర్రను ఉపయోగించగా.. మరో బృందం మాత్రం ఇతర ‘డైట్ కంట్రోల్’ పాటించారు. చివరకు డైట్ కంట్రోల్ పాటించిన వారితో పోల్చితే.. జీరా తిన్నవారు అత్యధికంగా బరువు తగ్గినట్లు తేలింది. దీన్నిబట్టి.. జీలకర్ర తినడం లేదా తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడమే కాక.. కేలరీలను వేగంగా బర్న్ చేయచ్చని తెలిసింది. కింద తెలిపిన విధంగా జీలకర్రను ఉపయోగిస్తే బరువు తగ్గడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో మీరూ చూసి ట్రై చేయండి..

Also Read: మీ బాడీలో ‘విటమిన్ సి’ ని ఇలా పెంచుకొండి

Cumin Health Benefits & Culinary Applications - Jessica Gavin

జీలకర్ర పొడి మరియు పెరుగు

ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలపండి. దీన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినండి. ఇలా 15 రోజులు పాటు చేస్తే మీరు బరువు తగ్గడం ఖాయం.

జీలకర్ర పానీయం

రాత్రిపూట జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే అదే నీటిలో మరిగించాలి. తర్వాత ఈ పానీయాన్ని వడకట్టి తాగాలి. మీకు మరింత రుచికరంగా అనిపించాలంటే.. మీరు నిమ్మకాయ రసాన్ని జోడించుకోవచ్చు. ఇలా 2 వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగి చూడండి.. ఖచ్చితంగా ఫలితం మీకే తెలుస్తుంది.

Also Read: శీతకాలంలో పెరుగు తినొచ్చా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *