health benefits of dates

ప్రపంచంలో హై బీపీ, హైపర్‌ టెన్షన్ 30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయాయి. వీటి మూలంగానే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ లాంటి జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల వల్లే ఏటా 1.76 కోట్ల మంది పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య మరో పదేళ్లలో (2030 నాటికి) సుమారు రెండున్న కోట్ల మందికి చేరొచ్చని ఓ స్టడీ అంచనా వేసింది.ఈ నేపథ్యంలో ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి. విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పదార్థాల్లోఖర్జూర ఒకటి. ఎక్కువగా అరబ్‌ దేశాలలాంటి ఎడారిప్రాంతాల్లో ఇవి పండుతాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ముస్లింలు రంజాన్‌నెలలో ఉపవాసం విడిచేందుకు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఏయే ప్రయోజనాలు లభిస్తాయో తెలిస్తే మీరు వదిలిపెట్టరు.

Also Read: సంపూర్ణ ఆరోగ్యానికి ఏ బియ్యం తినాలో తెలుసా ?

10 Amazing Benefits of Dates You Should Know! | Taste of Home

Also Read: చక్కెరతో బోలెడు చిక్కులు…ఇలా నివారించవచ్చు..

  • ఖర్జూర తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు, బీపీ కూడా అదుపులో ఉంటుంది.గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది.
  • వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. 100 గ్రాముల ఖర్జూరలో 0.90 ఎంజీ ఐరన్ లభిస్తుంది. రోజులో మనకు అవసరమయ్యే ఐరన్‌లో ఇది 11 శాతానికి సమానం. పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది.
  • మలబద్ధకం నివారించడంలోనూ వీటిది ముఖ్యపాత్రే.
  • రాత్రి పూట కొన్ని ఖర్జూరాలను నీటిలో వేసి తెల్లవారాక ఆ నీటిని తాగితే విరేచనం సాఫీగా అవుతుంది.
  • వీటిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు. బరువు తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
  • రక్తనాళాల్లోపేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి.
  • ఖర్జూరాలను నానబెట్టిన మిశ్రమాన్ని తాగడం వల్ల గుండెకు కూడా మేలు కలుగుతుంది.
  • రోజూ 5-6 ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా మెగ్నీషియం లభిస్తుంది.
  • ఇది రక్త నాళాలను వెడల్పు చేసి రక్త సరఫరా సరిగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.
  • పొటాషియం అధికంగా ఉంటుంది. రోజులో 400 ఎంజీల పొటాషియం తీసుకోవడం వల్ల గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుంది.

Also Read:  గోరువెచ్చని నీరు తో ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు