health benefits of eating fish

చేపలు కూర అంటే చాలు.. లొట్టలేసుకుని లాగించేస్తారు. చాలామందికి మాంసం కంటే చేపలను తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేసే పరిపుష్టికరమైన ఆహార పదార్థాలలో “చేపలు” అనేవి ఒకటి.ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండు సార్లు చేపలను తింటే మంచిది. దీంతో మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది. అలాగే మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్స్‌లోనూ ఇదే విషయాన్ని ప్రచురించారు.

Also Read: శరీర బరువు తగ్గించడానికి నిమ్మ తొక్కను ఇలా వాడండి

12 Astonishing Benefits of Eating Fish to Lead a Healthy Life

చేపలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయంలో తేలింది. మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రిసెర్చ్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్స్‌లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. చేపలను తినడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయని ఆయా కథనాల్లో పేర్కొన్నారు.

Also Read: కొబ్బరినీళ్లు చలికాలంలోనూ మేలు !

Fish has great health benefits for kids' eyes and brain | Parenting  News,The Indian Express

శరీరంలోని చెడు కొవ్వులను బయటకు పంపేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయట. దీని వల్ల శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోదు. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు.

Also Read: వేడి నీటితో స్నానం ఆరోగ్యానికి మంచిదా.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

What Types Of Fish Are Safe For Kids? - Julie Revelant | Raise Healthy Kids  Who Crave Healthy Food

ఎలాంటి చేపలను తింటే మంచిది?: చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే, మీరు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే మాకరెల్, సాల్మన్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా రకానికి చెందిన చేపలను తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే.. వారంలో కనీసం రెండుసార్లు చేపలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. లేదా వారానికి కనీసం 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన, లేదా వేయించిన (గ్రిల్లింగ్) చేపలను తినడం ఉత్తమం.

Also Read: మీ వంట ఇంట్లోనే ‘వయాగ్రా’ … అవి ఏమిటో తెలుసా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *