health benefits of jamun fruit

రేడుపళ్లు జూన్‌, జులై, ఆగస్టు మాసాలలో విరివిగా లభిస్తాయి. నేరేడుపళ్లను ఆయుర్వేదంలో వివిధ రుగ్మతలకు మందుగా వాడేవారు. కృత్రిమ ఇన్సులిన్‌ను కనుక్కోక ముందురోజుల్లో వీటిని మధుమేహానికి చికిత్సలో వినియోగించేవారు. విటమిన్‌ ’సి‘, ఫోలిక్‌ యాసిడ్లతో పాటు, పొటాసియం, జింకు, ఇనుము లాంటి అనేక ఖనిజాలు కూడా నేరేడు పళ్లలో పుష్కలంగా లభిస్తాయి.నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహు విధాలుగా ఉపయోగాపడుతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రధాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Also Read: వ్యాధినిరోధక శక్తిని పెంచే లెమన్ గ్రాస్…

Jamun Seeds For Diabetics: Heres How You Can Use Them In Your Diet ...

  • నేరుడు పండు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేయడమే కాక, రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరం యొక్క రోగ్యనిధోక శక్తిని పెంచతుంది.
  • నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది .కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
  • నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి.
  • వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యము ఆలస్యం చేస్తుంది. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది .
  • నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి.