Health Benefits of Moringa

మనం వంటకాల్లో ఎక్కువగా మనగకాడలను వాడుతుంటాము. దీంతో వంటలకు సువానతో పాటు మంచి రుచి, ఆరోగ్యాన్నికలిగిస్తాయి. అధికంగా మునగ కాడల్ని సాంబర్‌, ఇతర కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఈ కాడలనే కాకుండా మునగ ఆకును కూడా వంటల్లో వాడతారు. కాడలు వాడినంతగా ఆకును మాత్రం వాడరు. కానీ, మునగ ఆకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇది కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా మూత్రాశయంలో రాళ్లను కరిగించేందుకు మంచి ఔషధంగా పని చేస్తుంది. అలాగే మోరింగలో అనేకమైన విటమిన్లు, మినరల్స్‌ ఉన్నాయి. శరీరంలో కొవ్వును కరిగించేందుకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది.

Also Read: ఆశ్వగంధ… లైంగిక సంబంధిత సమస్యల నివారిణ !

Health Benefits of Moringa Oleifera - My Trusty Diet

 

మునగాకులో పోషకాలెన్నో..

మునగాకులో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఉబ్బసం తగ్గించడం, తల్లిపాలలో ఉత్పత్తి పెంచడం లాంటికి మంచి ఔషధంగా పని చేస్తుంది. మునగాకు వల్ల ఆరోగ్యానికి మేలు చేసేవి ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.

Ayurvedic Health Benefits of Moringa, Shevga or Drumstick Tree | Ayurved  Sadhana

మధుమోహంతో బాధపడేవారికి..

మునగాకులు మధుమోహంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్‌ క్లోరోజెనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది కాఫీలో కూడా ఉంటుంది. దీంతోపాటు షుగర్‌ లెవల్స్‌ లను కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో విటమిన్‌ -సి ఉంటుంది. అందుకే మధుమోహం-2 వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా మునగాకు టీ రోజువారిగా తాగడం వల్ల గుండెకు సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది.