COVID-19 Vaccine - Telugudunia.in

COVID-19 Vaccine : ప్రస్తుతం మన దేశంలో మూడో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశ, రెండో దశ పూర్తయ్యాయి.ఈ సందర్భంగా మీరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే.. మీరు కరోనా కేంద్రాల వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుండే..కేవలం కొన్ని క్లిక్స్ చేసి కరోనా వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు.. మీకు నచ్చిన సమయంలో వెళ్లి డోసులను వేయించుకోవచ్చు. ఈ సందర్భంగా ఇంటర్నెట్లో ఈ వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి…

Syringe, Hand, Virus, Injection, Vaccination

మీరు కోవిద్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే.. Co-win వెబ్ సైటులో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆరోగ్యసేతు యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్లో లేదా ఆన్ లైన్ లో Co-WIN యాప్ లేదనే సంగతి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కేవలం అధికారుల కోసం మాత్రమే. అయితే ఆరోగ్య సేతు యాప్ లో అందరికీ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది.

https://www.cowin.gov.in/ వెబ్ సైట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. మీకు ఇష్టమైన సమయంలో టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒక నెంబరుపై మొత్తం ముగ్గురి వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.

కరోనా వ్యాక్సిన్  రిజిస్టర్ చేయండిలా..

* ముందుగా కోవిన్ ttps://www.cowin.gov.in/ఓపెన్ చేయండి. లేదా ఆరోగ్యసేతు యాప్ లో ‘Vaccination’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి.

* మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.

* అప్పుడు మీ ఫోన్ కు ఓటీపి వస్తుంది.

* ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత Verify పైన క్లిక్ చేయండి.

* ఆ తర్వాత వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.

Also Read : డయాబెటీస్ ఉంటే ద్రాక్ష పండ్లు తినొచ్చు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *