importance of breakfast

ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సన్నగా అవ్వాలనో, లేక బరువు పెరుగుతున్నారనే భయంతోనో, మరేదైనా కారణాలతో బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే ఆరోగ్యం విషయంలో అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రోజులో ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యమని, అది మానేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కలిగే నష్టాలలో మధుమేహం, క్యాన్సర్ కూడా ఉన్నాయని తెలుసుకోండి. రాత్రంతా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచి తినే మొదటి ఆహారం ‘అల్పాహారం’. రాత్రి నుంచి ఉదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని ‘ఫాస్టింగ్’గా భావిస్తారు. అందుకే.. అల్పాహారాన్ని ‘బ్రేక్ ఫాస్ట్’ అని అంటారు. కాబట్టి.. ఉదయం టిఫిన్ మిస్ కావడం వల్ల కలిగే అనార్థలు, తినడం వల్ల కలిగే ఈ ప్రయోజనాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే.

Also Read: ఆకాకరతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…

Also Read: జలుబు, దగ్గు సమస్యను ఇలా కంట్రోల్ చేయండి !

The Benefits of Eating Breakfast

బ్రేక్‌ఫాస్ట్ వల్ల ఉపయోగాలు

  • బ్రేక్‌ఫాస్ట్ మానేసే మహిళలలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది. దాదాపు 47 వేల మంది మహిళలపై ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని గుర్తించారు.
  • బ్రేక్‌ఫాస్ట్ మానేయడమే కాదు, చాలా ఆలస్యంగా ఉదయం వేళ అల్పాహారం తీసుకున్నా చేటు చేస్తుంది. దీనివల్ల మేగ్రేన్ తలనొప్పి సమస్య బారిన పడే ప్రమాదముంది. దీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది.
  • ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినే వారితో పోల్చితే మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు 27 శాతం ఎక్కువగా ఉంటాయని తేలింది.
  • టీనేజీ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. అల్పాహారం తినే పిల్లలతో పోల్చితే తినని టీనేజర్స్ ఏ విషయంపైనా ఏకాగ్రత చూపలేరు.
  • బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం వల్ల శరీరంలో శక్తి లేక తరచుగా అలసటకు గురవుతాం. అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.
  • బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ వల్లే జట్టుకు కావలసిన అత్యధిక పోషకాలు అందడమే అందుకు ప్రధాన కారణం.

             Also Read: షుగర్ పేషెంట్స్ ఆరామ్ గా ఈ ఫ్రూట్స్ తినొచ్చు …