Health Benefits of Pumpkin

Pumpkin : చాలా మంది గుమ్మడికాయలతో కూర లేదా తీపి వంటకాలను చేసుకుని తింటారు. .గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ను , విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి , గుమ్మడితో కూర, పులుసు, సూప్‌ వంటివి చేసుకుంటాం. ఏం వండినా గుమ్మడి రుచికి తిరుగు లేదు. ఇది రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది.

Also Read : ఒత్తిడితో దంతలకు నష్టం

Health Benefits of Pumpkin

  • గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్‌-సి గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఎముకల సాంద్రతను దృఢ పరుస్తుంది. గుమ్మడిలోని పోషకాలవల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ, బీటాకెరొటిన్లు అధికం. ఇవి కంటిచూపునకు స్పష్టతనిస్తాయి. నేత్ర సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడి వంటకాలు తినిపించడం మంచిది.
  • తల్లి కావాలనుకుంటున్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. విటమిన్‌-ఎ శరీరంలో బీటా కెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూస్తుంది.
  • విటమిన్‌-సి అందించే కూరగాయల్లో గుమ్మడికూడా ఒకటి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడం వల్ల, ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

Also Read : హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు … అప్రమత్తత అవసరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *