Kiwi Fruit

కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. ఇదొక సాధారణ పండు కాదు. మిగిలిన పళ్లలో లేని ఎన్నో పోషక గుణాలు ఈ కివీ పండులో ఉన్నాయి. కివీ పండు అనేది ‘యాక్టినిడియా చైనిన్సెస్’ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. ఈ కివి పండుని ‘చైనీస్ గూస్ బెర్రీ’ అని కూడా పిలుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం.. ఈ పండ్లు ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి.కివీ పండ్లలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్స్… కివీ పండులో బాగా ఉంటాయి.

Also Read: వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రత్యేక పండ్లు…

Breakfast, Cookery, Cooking, Food, Fresh, Fruit

కివీ ఫ్రూట్‌తో ప్రయోజనాలివే..

  1. కివీ లో కమలాలకు రెట్టింపు ‘విటమిన్‌ సి’, ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయి.
  2. పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాలుంటాయి.
  3. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది అద్భుత ఫలం.
  4. కివీ ఫ్రూట్‌ లోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి.
  5. కంటి చూపునకు ఇది చక్కగా తోడ్పడుతుంది. ఇందులో ఉండే లుటియిన్‌ పదార్థం మక్కజొన్నలో మినహాయించి ఎందులోనూ ఉండదు. రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత, వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
  6. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారి శరీరంలోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
  7. కాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్ధం ఈ పండులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
  8. చర్మ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.
  9. విరోచనకారిగా ఉపయోగపడుతుంది.
  10. అత్యధికంగా బీటా కెరోటిన్‌ ఉన్నందున మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
  11. కాలేయ క్యాన్సర్లను నిరోధిస్తుంది.
  12. కివీలోని ‘ఇనోసిటాల్’ అనే పదార్థం మనోవ్యాకులత చికిత్సకు ఉపయోగపడుతుంది.
  13. కివీ విత్తనాలనుంచి తీసిన ఆయిల్‌లో 62% ఆల్ఫాలినోలిక్, ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానిని మంచిది.

Also Read: నోటి నుంచి చెడు వాసన నివారించాలంటే….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *