mentally healthy during coronavirus

కరోనా బాధితులు అనేకమంది దానిపై పోరాడేందుకు మానసిక స్థైర్యాన్ని, ఉల్లాసాన్ని వెతుక్కుంటున్నారు. వైరస్ నుంచి దృష్టి మరల్చడానికి వినోదాన్ని నమ్ముకుంటున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గులాంటిదేనని, తక్షణం పసిగట్టగలిగితే అదే పెద్ద జబ్బు కాదని వైద్యులు చెబుతున్నారు. కరోనాకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన మందు, వ్యాక్సిన్ ఏమి రాలేదు. అయితే జ్వరం సహా ఇతర సాధారణ లక్షణాలుంటే పారసిటమాల్, యాంటిబయోటిక్స్ మందులు, ఇతర విటమిన్ టాబ్లెట్లు వాడుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటున్నారు. వైరస్ తీవ్రత పెరిగితే ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. కాబట్టి ఆక్సిజన్ అవసరమౌతోంది. ఒక్కోసారి మరింత విషమమైతే వెంటిలేటర్‌పైకి వెళ్తున్నారు.

How to Cope With Loneliness During the Coronavirus Pandemic

వైద్యులు కూడా కరోనా సాధారణ జ్వరం, జలుబు, దగ్గులాంటిదేనని చెబుతున్నారు. దాన్ని తక్షణం పసిగట్టగలిగితే అదేం పెద్ద జబ్బు కాదంటున్నారు. దానికున్న ప్రధాన లక్షణం వేగంగా వ్యాప్తి చెందడమే. అయితే త్వరగా గుర్తిస్తే అది మనల్ని ఏమి చేయదని వైద్యులు చెబుతున్నారు. అలాంటి సాధారణ వైరస్ ప్రపంచాన్ని గడతడలాడిస్తుంది. తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే కొందరికి భయాందోళనల వల్ల ఇతరత్రా దీర్ఘకాలిక రోగాలు మరింతగా విజృంభిస్తున్నాయి. కరోనా కంటే భయమే మనల్ని ఆందోళనకు, అది తీవ్రమైతే మరణానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతికూలమైన ఆలోచనలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మందులు, మంచి ఆహారం ఎంత ముఖ్యమో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మానసిక ప్రశాంతత అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇళ్లలో, ఆసుపత్రుల్లో ఉన్నవారంతా వినోదాన్ని వెతుక్కుంటున్నారు.