health benefits of raisins

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్‌ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్‌ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. ఎండు ద్రాక్ష మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి.ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్‌, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

Also Read

కీరా వాటర్ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Food, In Good Health, Meals, Kitchen, Dried Fruit

మధుమేహం, గుండె పోటు, కాన్సర్‌ లాంటి వ్యాధుల బారి నుంచి రక్షించు కొనేందుకు ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర వృక్షసంబంధ రసాయనాలు ద్రాక్షలో అధిక మొత్తంలో ఉంటాయి. ఎర్ర ద్రాక్ష, నల్ల ద్రాక్షలో ఉన్న రిజర్వేటాల్‌ అనే రసాయనం పెద్ద ప్రేవుల కాన్సర్‌, బ్రెస్ట్‌ కాన్సర్‌లను అడ్డగిస్తుంది. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ఫ్లేవనాయిడ్లు అంటారు. వీటికి కూడా ఎర్ర ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లకు ధీటుగా పనిచేసే శక్తి ఉంది. భావోద్వేగాలను నియంత్రించడంలో, మెదడు పనితీరును ప్రభావితం చేయడంలో ఉపకరించే విటమిన్‌ ‘బి-6’ ద్రాక్షలో అధికం. ద్రాక్షలో చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉన్నా, ఇవి తక్కువ – మధ్యరకం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారపదార్థాలు. కాబట్టి ప్రమాదకరం కాదు. అందుకే మధుమేహ రోగులు వీటిని తక్కువ మొత్తంలో తినవచ్చు. ప్రయోజనాలన్నీ పొందాలంటే ద్రాక్షను పళ్లుగానే తినడం మంచిది, చక్కెర కలిపి జ్యూస్‌గా చేయడం వల్ల లాభాలు తగ్గుతాయి.

Also Read: అద్భుత ఔషధాల గని అలోవెరా !