reading benefits

ఉరుకుల పరుగుల జీవితం, మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల పుస్తకాలు చదివే వారి శాతం తగ్గిందనే చెప్పాలి. అయితే చదవడం వల్ల జ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? పుస్తకాలు, నవలలు, వార్తాపత్రికలు ఏవైనా చదవడం వల్ల శక్తిమంతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉంటుంది. చదవడం వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:గ్రీన్ టీ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందా ?

Book, Bezel, Read, Reading, Woman, Girl, Library, Study

చదవడం వల్ల ప్రయోజనాలు

  • 2013లో జరిగిన అధ్యయనం ప్రకారం నవలలు మెదడును చురుగ్గా చేస్తాయి. భాషపై పట్టు పెరుగుతుంది. రీడింగ్ మెదడులోని న్యూరాన్లను సృష్టిస్తుందని న్యూయార్క్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సబ్రినా రోమనోఫ్ చెప్పారు.
  • జ్ఞానం అంటే గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, జడ్జిమెంట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. చదవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.
  • చదవడం వల్ల మతిమరుపు రావడానికి కూడా తక్కువ అవకాశం ఉందని తేలింది.
  • కేవలం 30 నిమిషాలు చదవడం వల్ల ఒత్తిడి, శారీరక మానసిక ఆందోళనలను తగ్గించవచ్చు అని పరిశోధనలో తేలింది.
  • 30 నిమిషాలు వార్తా కథనాలను చదివిన విద్యార్థుల హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఒత్తిడి లాంటివి తగ్గాయని తేలింది. ఐతే… వార్తలు చదవడం అందరికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. వాటి బదులుగా నవలలు, ఇతర కథలు చదవవచ్చు.
  • మెదడు ఆరోగ్యాన్ని పఠనం మెరుగుపరుస్తుంది. ఇది దీర్ఘాయుష్షును పెంచుతుంది. 12 ఏళ్ల పాటు సాగిన అధ్యయనం 2017లో ప్రచురితమైంది. దీని ప్రకారం పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారిలో మరణ ప్రమాదం 20 శాతం తగ్గుతుందని తేలింది.
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుదల: మనుషులు చదువుతున్నప్పుడు మెదడులో దృశ్యాలు ఏర్పడుతుంటాయి. అవి మెమరీ రీకాల్, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తి పెరగాలంటే రెగ్యలర్ రీడింగ్ అవసరమని రోమనోఫ్ చెప్పారు.

ఎలా చదవాలి: చదువును మీ డైలీ హాబీగా మార్చుకోండి. మధ్యాహ్నం టైమ్‌లో లేదా… నిద్రపోయే ముందు కనీసం ఓ అరగంట చదవడం మేలని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read:చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదా ? ఎలాంటి చేపలను తినాలి ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *