semi polished rice nutrition

Semi Polished Rice :ఈ రోజుల్లో బీపీ, షుగ‌ర్ లాంటి జీవ‌న‌శైలి వ్యాధులు వేగంగా విస్త‌రిస్తున్నాయి. దాంతో ఆరోగ్యంపై చాలామందిలో కేర్ పెరిగింది. ఏం తినాలో ఏం తిన‌కూడాదో తెలుసుకుని ఆచితూచి వ్య‌వ‌హరిస్తున్నారు. అయితే బియ్యం విష‌యంలో మాత్రం కాంప్ర‌మైజ్ కాలేక‌పోతున్నారు. రుచి కోసం ఎక్కువ మంది తెల్ల బియ్యాన్నే వినియోగిస్తున్నారు. కానీ, వైద్య నిపుణులు మాత్రం తెల్ల‌టి పాలిష్డ్ బియ్యం కంటే ముడి బియ్య‌మే ఆరోగ్యానికి మంచిద‌ని చెబుతున్నారు. మ‌రి ముడి బియ్యంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసుకుందామా..?

Brown Rice vs. White Rice: Which Rice Is Healthier? | UPMC HealthBeat

  • ఒక‌ 100 గ్రాముల ముడి బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే 1.8 గ్రాముల ఫైబర్‌ లభిస్తుంది. అదే మోతాదులో తెల్ల బియ్యాన్ని తీసుకుంటే కేవలం 0.4 గ్రాముల ఫైబర్‌ మాత్రమే అందుతుంది.
  • ముడి బియ్యంలో కావాల్సిన‌న్ని పోష‌కాలు ఉంటాయి. కానీ, పాలిష్ చేయ‌డంవ‌ల్ల తెల్ల‌ బియ్యంలో పోష‌కాలు న‌శించి మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు అంద‌వు.
  • ముడిబియ్యం తీసుకోవ‌డంవల్ల శ‌రీరంలో హెచ్‌డీఎల్ ‌(మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు పెరిగి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను ‌(కొవ్వును) తగ్గిస్తుంది.
  • ముడి బియ్యానికి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ల‌క్ష‌ణం ఉండ‌టంవ‌ల్ల గుండె జబ్బులు వ‌చ్చే ప్ర‌మాదం కూడా త‌గ్గుతుంది.
  • బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముడి బియ్య‌మే బాగా ప‌నిచేస్తాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల ముడి బియ్యం తినే వారిలో కొవ్వు క‌రిగిపోయి స‌న్న‌బ‌డుతారు.

మితాన్ని మించితే ప్ర‌మాదం సుమీ..!

ముడి బియ్యంలో యాంటి న్యూట్రియెంట్స్ (పోష‌కాల‌ను న‌శింప‌జేసే విష రసాయ‌నాలు) కూడా ఉంటాయి. అయితే రోజూ ప‌రిమితంగా ముడి బియ్యం తీసుకోవ‌డంవ‌ల్ల ఆ విష ర‌సాయ‌నాల‌తో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండ‌దు. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్ర‌మాద‌మే అంటున్నారు వైద్య నిపుణులు. మోతాదుకు మించి ముడి బియ్యం తీసుకోవ‌డంవ‌ల్ల శ‌రీరంలో యాంటీ న్యూట్రియెంట్స్ శాతం పెరిగి పోష‌కాలు శ‌రీరానికి అంద‌కుండా చేస్తాయ‌ని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *