Immune System

Immune System  : రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తి తరచుగా అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కంటి నిండా నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండే వ్యక్తులు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది.

Immune System

అయితే, ఈ వైరస్ ఎవరికీ వదిలిపెట్టడం లేదు. ఆరోగ్యంగా ఉన్నాం అనుకొనే వ్యక్తులను కూడా బురిడీ కొట్టిస్తోంది. ఎందుకంటే.. మన శరీరంలో రోగనిరోధక శక్తి (Immune System )సరిపడా ఉందా, లేదా అనేది మనకు అంత సులభంగా తెలియదు. అయితే, కొన్ని లక్షణాలు ద్వారా మన ఇమ్యూనిటీ పవర్‌ను అంచనా వేయొచ్చు. మరి ఆ లక్షణాలు గురించి తెలుసుకోండి.

రోగనిరోధక శక్తి బలహీన సంకేతాలు

  • మీరు తరచుగా అనారోగ్యానికి గురైన, లేదా అలసిపోయినట్లుగా అనిపిస్తున్నా.. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని గుర్తించాలి.
  • మీరు ఎక్కువగా నిద్రపోయిన తర్వాత కూడా మీలో అలసట ఎక్కువగా ఉన్నట్లనిపిస్తే ఖచ్చితంగా మీలో రోగనిరోధక శక్తి తగ్గుతున్నట్లేనని గుర్తించాలి. రోగ కారకాలతో పోరాడేందుకు రోగనిరోధక శక్తి శరీరంలోని శక్తిని ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది. అందువల్లే అలసట కలుగుతుంది.
  • మీరు నిరంతరం జలుబుతో బాధపడ తున్నారా .. అయితే, ఈ సమస్య నిరంతరం కొనసాగుతుంటే మాత్రం రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని భావించాలి. ఇది మీ జీవనశైలి, పరిశుభ్రత సమస్యల వల్ల కావచ్చు. మీకు స్మోకింగ్ అలవాటు రోగనిరోధక వ్యవస్థ కణాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.
  • మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ శరీరం కార్టికోస్టెరాయిడ్స్‌ను విడుదల చేస్తుంది. ఇది మన శరీరంలోని లింఫోసైట్‌ల సంఖ్యను తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తుంది.
  • మన రోగనిరోధక వ్యవస్థ 70 శాతం మన పేగుల్లోనే ఉంటుంది. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాతో నిరంతరం పోరాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. పేగుల్లో ఉండే బ్యాక్టరియా టి-కణాలు లేదా సైనిక కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *