spine gourd health benefits

ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటిని ఆకాకర కాయలు లేదా బోడ కాకర అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. అందుకే.. ధర కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇది శరీరానికి అందించే ఆరోగ్యం ముందు.. ధర పెద్ద లెక్క కాదు. ఆ కాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. మరి ఆకాకరతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూద్దామా!

Also Read: వ్యాధినిరోధక శక్తిని పెంచే లెమన్ గ్రాస్…

My Gourmet Kitchen: Health Benefits of Spiny Gourd or Kantola

ఆకాకరతో ప్రయోజనాలు
  • వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి.
  • ఆకాకరలోని విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
  • ఆకాకరలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి.
  • ఆకాకర కాయ కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
  • ఈ కాయలను తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆకాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
  • ఆకాకరలోని ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
  • సాధారణ కాకర కాయ తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.
  • ఆకాకర రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
  • ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
  • క్యాన్సర్ల బారిన పడకుండా ఆకాకర అడ్డుకుంటుంది.
  • ఆకాకరను వండేప్పుడు.. వాటిపై ఉండే బొడిపెలను తీయకూడదు. ఎందుకంటే అసలైన పోషకాలు అందులోనే ఉంటాయి.

     Also Read: పసుపు పాలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు