steam therapy

కరోనా వైరస్‌ నియంత్రణకు తాజాగా ఆవిరి చికిత్స (స్టీమ్‌ థెరపీ) ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వైద్యులు 3 నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ఆస్పత్రికి చెందిన డా.దిలీప్‌పవార్‌ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు.

Also Read: మన వంట ఇల్లే ఒక వైద్యశాల

Steam therapy - Stress Buster

  • పలువురు కోవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లపై స్టీమ్‌ థెరపీ ప్రయోగం.
  • అసింప్టమాటిక్‌ (ఎలాంటి లక్షణాల్లేని) పాజిటివ్‌ బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరితగతిన కోలుకున్నారు.
  • సాధారణంగా ఇది హోం రెమిడీ (ఇంటి చిట్కా) అయినా కోవిడ్‌ సమయంలో బాగా ఉపయోగపడుతోంది.
  • పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు.
  • మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేయగా మూడు రోజుల్లోనే కోలుకున్నారు.
  • అదే లక్షణాలుండి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలో సాధారణ స్థితికొచ్చారు.
  • కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో ఆవిరి చికిత్స చేశారు.