sugar affect your body

టీ, కాఫీ, స్వీట్లరూపంలో చక్కెరను ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటాం. కొందరైతే టీ, కాఫీలో ఎక్కువ మొత్తంలో షుగర్ వేసుకుంటారు. దీని వాడకం మన పూర్వీకులనుంచి వస్తోంది. ప్రస్తుతం పిల్లలు చాక్లెట్స్‌, కేకుల రూపంలో ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకుంటున్నారు. మరి ఇది తాత్కాలికంగా శక్తిని, ఆనందాన్ని ఇచ్చినా దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి నష్టం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read: లవంగాలు తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Sugar intake linked to unhealthy fat deposits, study finds | Food Beverage  Insider

 

చక్కెరతో వచ్చే సమస్యలు..

బరువు పెరుగుట

టైప్ 2‌ డయాబెటిస్‌ ప్రమాదం

ఆరోగ్యం క్షీణిస్తుంది.

హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం

చర్మం లేదా మొటిమల సమస్యలు

గ్లైకేషన్‌ ప్రకియ ద్వారా చర్మానికి హాని

చర్మంపై ముడతలు, వృద్ధాప్య చాయలు..

చక్కెరతో వచ్చిన సమస్యలను ఇలా నివారించవచ్చు..

  • చక్కెర నిండిన పానీయాలు, కేకులను తినడం మానేయాలి.. దీనికి బదులుగా పండ్లు తీసుకోవాలి.
  • సాస్‌లను వాడద్దు.. ఇందులో చక్కెర ఉంటుంది. దీనికి బదులుగా ఎండిన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, వెనిగర్, పసుపు ఆవాలు, పెస్టోలను ఉపయోగించవచ్చు.
  • నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. ఇది మన శరీరంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. వృద్ధాప్య ప్రభావాలతో పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. విటమిన్ సి (నారింజ, గూస్బెర్రీ, కివి, నిమ్మ), విటమిన్ ఈ (ఆకుకూరలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆలివ్, అవోకాడో, బాదం) ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • తగినంత నిద్ర పోవాలి.. రాత్రి మంచిగా నిద్రపోతే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ముడతలు మాయమవుతాయి.