Symptoms of a Heart Attack

ఈ మధ్యకాలంలో హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తం గా ప్రతి ముగ్గురిలో ఒకరు గుండె జబ్బుల బారిన పడుతున్నారట. హార్ట్ ఫెయిల్యూర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అరిత్మియస్ పాటు ఇతర గుండె సంబంధిన ఇన్ఫెక్షన్స్, ఇర్రేగులారిటీస్ అలాగే బర్త్ డిఫెక్ట్స్ వంటివన్నీ హార్ట్ డిసీజ్ కోవలోకే వస్తాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం కొరోనరీ హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయే దాదాపు 50 శాతం మంది మగవారికి ఈ వ్యాధికి గురైన విషయం తెలియదట.హార్ట్ ఎటాక్ ను గమనించి సరైన సమయంలో కేర్ తీసుకుంటే ట్రీట్మెంట్ సులభతరం అవుతుంది. ఈ క్రింది లక్షణాల ద్వారా గుండె సమస్యలని ముందే కనిపెట్టొచ్చు. అవేంటంటే..

Also Read: బాదం పప్పులను నానబెట్టే తింటే … ప్రయోజనాలు ఏమిటీ?

26-Year-Old's Heart Attack Linked to Energy Drink | Live Science

హార్ట్ మజిల్ కు రక్తసరఫరా ఆగిపోయినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండె పట్టేసినట్టు ఉండటం, ఒత్తిడి లేదా గుండె నొప్పి వంటివి మగవారిలో సాధారణంగా హార్ట్ ఎటాక్ కి సంబంధించిన కొన్ని లక్షణాలు. ఇంతకు ముందు కేవలం చెస్ట్ పెయిన్ మాత్రమే హార్ట్ ఎటాక్ కి సంబంధించిన లక్షణమని అనుకునేవారు. ఐతే, మరీ బాధాకరంగా అనిపించని లక్షణం కూడా హార్ట్ ఎటాక్ కి సంబంధించిన సూచనను చేస్తుందని గమనించాలి. ఈ అసౌకర్యం చేతులు, బ్యాక్, నెక్, పొత్తికడుపు లేదా దవడల వద్ద కూడా కనిపిస్తుంది.

Also Read: కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

హార్ట్ ఎటాక్ సమయంలో

  • శ్వాస సరిగ్గా ఆడదు
  • విపరీతమైన చెమట పడుతుంది
  • వికారం వస్తుంది
  • తల తిరుగుతుంది
  • కన్ఫ్యూజన్, మాట్లాడటంలో ఇబ్బంది లేదా ఇతరులు చెప్పేది అర్థంచేసుకోలేకపోవడం
  • బాలన్స్ కోల్పోవడం, కో ఆర్డినేషన్ మిస్సవడం
  • కంటిచూపులో మార్పులు
  • విపరీతమైన తలనొప్పి

వీటిలో చాలామటుకు మార్పులు ఎటువంటి వార్నింగ్ లేకుండా వస్తాయి.

మీరు ఫేస్ చేస్తున్న లక్షణాలకు హార్ట్ ఎటాక్ తో సంబంధం ఉందని మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అలాగే లక్షణాలు ఉన్నా లేకున్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ను తగ్గించుకోవడం ముఖ్యం. రెగ్యులర్ చెకప్స్ ను షెడ్యూల్ చేసుకోండి. మీ హెల్త్ కండిషన్ ఎక్సెలెంట్ గా ఉన్నా కూడా రెగ్యులర్ చెకప్స్ అవసరం. భవిష్యత్తులో ఎదురవబోయే హెల్త్ కండిషన్స్ ను ఫేస్ చేయడానికి సరైన విధంగా మెడికల్ ఎటెన్షన్ ను పొందడానికి రెగ్యులర్ చెకప్స్ అవసరం.

Also Read: ఆకాకరతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…