lungs health

Lungs Health  : ఊపిరితిత్తులు ప్రధానంగా శ్వాస ప్రక్రియలో పాల్గొంటాయి. సరళంగా చెప్పాలంటే, ఆక్సిజన్‌ను అన్ని అవ‌య‌వాల‌కు పంపించి.. శరీరం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను తొలగిస్తాయి. లాక్‌డౌన్ సమయంలో జీవితాలన్నీ నిలిచిపోగా, ప్రకృతి అభివృద్ధి చెందింది. భారతదేశంలో ముఖ్యంగా, పర్వత శ్రేణులు చాలా దూరం నుంచ కనిపించడం ముఖ్యాంశాలుగా మారాయి. అన్‌లాక్‌తో ప్ర‌జ‌లు ఎప్ప‌టిమాదిరిగా ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోవ‌డంతో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరుగడం ప్రారంభమైంది. ఈ స‌మ‌యంలో మ‌నకు ఆక్సిజ‌న్‌ను అందించే ఊపిరితిత్తులు అనారోగ్యానికి గుర‌వుతున్నాయి. వీటి ఆరోగ్యం కోసం పోష‌కాహారాలు తీసుకోవ‌డంతోపాటు వాయు కాలుష్యం ప్రభావాలను నివారించుకోవాలి.

Fat found in overweight people's lungs - BBC News

 

  • ఆరోగ్యకరమైన కొవ్వులను అందించే బాదం, వాల్‌నట్, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పిస్తాలు, క్యారెట్‌ను అల్పాహారం కోసం చేర్చుకోవ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • నిత్యం బజ్రా, జోవర్, రాగి, ఇతర మిల్లెట్లు, వోట్స్ వంటి తృణ‌ధాన్యాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు, చేపలు, లీన్ మ‌ట‌న్‌, పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, సోయాబీన్, పప్పుధాన్యాలు మొదలైనవి భోజ‌నంలో ఉండేట్లుగా చూసుకోవాలి.
  • మ‌జిల్ మాస్‌ను కాపాడటానికి ఉసిరి, జామ‌, నారింజ, స్ట్రాబెర్రీ, కివి, విటమిన్ సీ ల‌భించే పండ్లు తినాలి. పసుపు మరియు నారింజ పండ్లు, కూరగాయల్లో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
  • భోజనం స‌మ‌యంలో కాకుండా రోజంతా కొంచెం వేడి చేసిన‌ నీటిని తాగుతుండ‌టం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రాణాయామం, కపాల్‌బాతి వంటి శ్వాస వ్యాయామాలు ప్ర‌తి రోజు చేయడం మంచిది.

వేపుడ్లు అస‌లే వ‌ద్దు

సాధారణ కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కెట్లు, రొట్టె, వెన్న, ఖరీ, టోస్ట్, కేక్, పేస్ట్రీలు, పావ్ మొదలైన వాటిలో సోడియం, ప్రిజ‌ర్వేటీవ్స్ ఉండి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయి. అలాగే, వడా, కట్లెట్, సమోసా, చిప్స్, ఫ్రైడ్ రైస్‌, చికెన్ ఫ్రైలు.. మొదలైన వేయించిన వస్తువులను దూరం పెట్టాలి.

సిగ‌రెట్‌, మ‌ద్యం వద్దే వ‌ద్దు

భోజనం చేసిన వెంటనే పడుకోకుండా చూసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించాలి. స్థిరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవచ్చున‌ని గుర్తుంచుకోవాలి.

పాలకూర, మెంతి, బీట్‌రూట్, టమోటాలు, క్యారెట్, ఉల్లిపాయ, బ్రోకలీ, మిరియాలు వంటి రంగురంగుల కూరగాయలు, వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చినచెక్క, తులసి, ఏలకులు, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, పుదీనా ఆకులను తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *