Sleep Better

Sleep Better : నిద్రలేమి.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైంది. అయితే పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం, ఇతర ఆరోగ్య సమస్యలు.. మొదలైనవన్నీ ఇందుకు కారణమవుతున్నాయనేది కొందరి అభిప్రాయం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని పద్దతులు పాటించాలంటున్నారు నిపుణులు అవి..

Sleep Better

ఈ టిప్స్‌ పాటించండి.. ఎంచక్కా నిద్రపోండి.

  • పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
  • గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
  • చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
  • రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి.
  • నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.
  • రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి.
  • ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *