turmeric milk health benefits

పసుపు పాలు అనేది ఇప్పటి చిట్కా కాదు. మన పూర్వికులు ఆరోగ్య రహస్యం గురించి ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. చాలామంది శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా ట్రెండింగులో ఉన్న ఎనర్జీ డ్రింక్ ‘పసుపు పాలు’. రోజూ పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మీకు తెలిసిందే. మరి పసుపు పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దామా.

Also Read: జలుబు, దగ్గు సమస్యను ఇలా కంట్రోల్ చేయండి !

Cherise Gujrati Haldi Doodh Powder, Packaging Type: Packet, Rs 500 /kg | ID: 22010910355

పసుపు పాలతో  ఆరోగ్య ప్రయోజనాలు !

  • దగ్గు, జలుబుతో బాధపడేవారు పసుపు పాలను తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
  • ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
  • పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.
  • కామెర్లు దరిచేరకుండా పసుపు పాలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది.
  • పాలలోని పోషకాలు, పసుపులోని ఔషద గుణాలు.. మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • పసుపు పాలు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
  • పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది.
  • నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది.
  • పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
  • కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.
  • పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి.
  • రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.
  • కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
  • పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలటోనిన్‌లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది.
  • కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి.

Also Read: స్టీమ్‌ థెరపీ…. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు