White rice linked to diabetes

అన్నం లేకుండా భోజనం ఊహించడం కష్టమే. అల్పాహారం నుంచి పిండివంటల వరకు చాలా వంటలలో బియ్యంతో చేసిన పదార్ధాలు కనిపిస్తాయి.ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికిపైగా ప్రజలకు వరిఅన్నం ప్రధాన ఆహారం. ఇంత ప్రాముఖ్యమున్న వరి అన్నం తినడం వలన చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని 21 దేశాలలో పరిశోధకులు 10 ఏళ్ల పాటు 1,30,000 మందిపై చేసిన అధ్యయనంలో తేల్చారు. మన ఇండియా లో 20 – 79 ఏళ్ల మధ్య వయస్కులలో 10.39 శాతం టైపు 2 డయాబెటిస్ బాధితులని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ 2017 గణాంకాలు చెబుతున్నాయి. ఆహారంలో బియ్యంతో తయారు చేసిన పదార్థాల వినియోగానికి చక్కెర వ్యాధికి సంబంధం ఉందని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. అన్నంలో అధిక స్థాయిలో పిండి పదార్థాలు, గ్లైసెమిక్ శాతం ఉండటంతో చక్కెర వ్యాధితో భాదపడుతున్న వారిని అన్నం తినొద్దని వైద్యులు సూచిస్తారు. ఆహారంలో ఉండే పిండి పదార్థాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేసే స్థాయిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.

Also Read: ఖర్జూర తింటే గుండె జబ్బులు పరార్ …

Why Traditional Food Served on Banana Leaf In States of South India? -  FoodGuruz

Also Read: సంపూర్ణ ఆరోగ్యానికి ఏ బియ్యం తినాలో తెలుసా ?

ఎలా తినాలి ?

  • డయాబెటిస్ తో ఉండేవారు కేవలం ఆహారంలో అన్నంతో కూడిన పదార్ధాలను తగ్గించడం వలన మాత్రమే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గవని చెబుతూ, రోజులో ఎంత శాతం పిండి పదార్ధాలతో కూడిన ఆహారం తీసుకుంటున్నారో చూసుకోవడం అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి.
  • చక్కర వ్యాధితో ఉండేవారిలో ఎముకల బలహీనత త్వరగా ఏర్పడటం వలన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు ఆహారంలో ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
  • వారంలో కనీసం మూడు సార్లు బియ్యంతో వండిన పదార్ధాలైన ఇడ్లీ, దోస స్థానంలో ఓట్స్, గోధుమ నూక, తృణ ధాన్యాలతో చేసిన బ్రెడ్ తీసుకోవచ్చు. మిగిలిన రోజుల్లో ఎప్పుడూ తీసుకునే అల్పాహారాన్ని తీసుకోవచ్చు.
  • తెల్లని అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తినవచ్చు. తినలేకపోతే, అన్నం మోతాదు తగ్గించి తీసుకోవచ్చు.
  • తక్కువ మోతాదులో అన్నం, ఎక్కువ పప్పు, ఆకు కూరలు, పెరుగు, ప్రోటీన్ ఉండే చికెన్, కోడి గుడ్డులోని ప్రోటీన్ , చేపలు, బీన్స్, తక్కువ కొవ్వు ఉండే పనీర్ తీసుకోవచ్చు.
  • చక్కెరకు బదులుగా పళ్ళు తీసుకోవచ్చు.
  • పచ్చి మొలకలతో చేసిన చాట్, ఫ్రూట్ సలాడ్ లాంటివి తీసుకోవాలి
  • ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి
  • రాత్రి భోజనం 8 గంటల లోపే ముగించాలి.

ఏ ఆహార విధానమైనా అందరికీ ఒకేలా పని చేసే మ్యాజిక్ చిట్కా ఏమీ లేదని, మనం చేసే పని, శరీర తీరుకి అనుగుణంగా మనం ఆహారం తీసుకునే విధానం చూసుకోవాలి.

Also Read: వ్యాధినిరోధక శక్తిని పెంచే లెమన్ గ్రాస్…