World Hypertension Day 2021

World Hypertension Day 2021  : ఆధునిక జీవిన శైలిలో మార్పుల కారణంగా ప్రస్తుతం రక్తపోటు సమస్య బారిన పడే సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయసు పైబడిన వారిలో ప్రతి అయిదుగురు వ్యక్తులలో ఒకరికి అధిక రక్తపోటు (Hypertension) సమస్య ఉంది. దీనినే High BP అని కూడా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 9.4 మిలియన్ల మంది అధిక రక్తపోటు సమస్య కారణంగా కన్నుమూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తరచుగా తలనొప్పి లేదా అధిక బిపిగా నిర్లక్ష్యం చేయబడిన, రక్తపోటు సరైన సమయంలో సరిగ్గా చికిత్స చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఉప్పు (సోడియం) తినడం, అధిక బరువు ఉండటం మరియు తగినంత వ్యాయామం చేయకపోవడం, అలాగే పొగాకు వాడటం వంటి వాటి వల్ల ర‌క్త‌పోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

Also Read : హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు … అప్రమత్తత అవసరం

Hypertension, High Blood Pressure, Heart Disease

రక్తపోటు ఆధారంగా గుండె పనితీరును వైద్యులు సులువుగా గుర్తిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వారిలో రక్తపోటు 120/80 గా ఉంటుంది. ఇది ఒకవేళ 130/80కి మించితే హైపర్‌టెన్షన్ సమస్య బారిన పడ్డారని చెప్పవచ్చు. కొందరు నాకు బీపీ తెప్పించకు అని అంటుంటారు. కారణంగా బీపీ వచ్చిందంటే ఆలోచన తీసుకునే వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు తొందరపాటులో తప్పిదాలు చేయవచ్చు. అదే సమయంలో రక్తపోటు(Blood Pressure) అధికం కావడంతో గుండె సంబంధిత సమస్యలు సైతం వస్తాయిని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  • హైబీపీ కారణంగా మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కారణాలతో గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కచ్చితంగా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • ఒత్తిడిని జయించే విధానాన్ని బట్టి పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరికీ హైపర్‌టెన్షన్ సమస్య వస్తుంది. అయితే మహిళలలో (Post-menopause) మోనోపాజ్ తరువాత అధిక రక్తపోటు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
  • హైపర్‌టెన్షన్ ఏ సమయంలోనైనా, ఏ వయసులోనైనా వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలిని బట్టి హైబీపీ సమస్య వస్తుంది.
  • బీపీ షేషెంట్లు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. ఒకవేళ అకస్మాత్తుగా హైబీపీ ట్యాబ్లెట్లు, బెడిసిన్ వాడకం మానివేయడం కారణంగా గుండె, మెదడు, మూత్రపిండాలు లాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

Also Read : కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా … లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *