Akkineni and Surender Reddy new movie

యంగ్ డైనమిక్ హీరో అఖిల్ మరియ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది అని విపరీతమైన బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి ఇపుడు అఖిల్ హీరోగా భారీ సినిమాను తీయడం ఖరారు అయ్యింది.వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీ తో ఈ చిత్రం భారీ స్థాయి లో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ల క్రేజీ కాంబినేషన్ లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ కే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.

Also Read: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న .. ప్రగ్యా జైస్వాల్

Image


తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రం లో అఖిల్ ని సరికొత్తగా చూపించనున్నారట. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఎ కే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తొందరలోనే తెలుపనున్నారు.