anushka comments on casting couch

‘సూపర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన 15 సంవత్సరాల సినీ జర్నీ పూర్తిచేసుకుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని, ఇందులో దాచేదేమీ లేదని చెప్పుకొచ్చింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడ్డానని, కెరీర్ ఆరంభంలో అలాంటి కొన్ని అనుభవాలు ఎదురుకాగా.. ధైర్యంగా, ముక్కుసూటిగా ఉండటం వల్ల కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని అనుష్క తెలిపింది. అయితే ఇప్పటిదాకా తనతో ఎవ్వరూ మిస్ బిహేవ్ చేయలేదని చెబుతూ, ఈ ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనుష్క.

Also Read: సుమంత్ ‘క‌ప‌టధారి’ ఫస్ట్‌లుక్‌

ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంగ్లీష్‌లో సైలెన్స్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు.