Anushka Shetty about social media

బాహుబలి, భాగమతి చిత్రాలతో దక్షిణాదిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్‌గా అనుష్క శెట్టి పేరు సంపాదించుకొన్నారు.అయితే అందరు హీరోయిన్ల మాదిరిగా అనుష్క శెట్టి భేషజాలు ప్రదర్శించరు. సోషల్ మీడియాలో ఊకదంపుడు కామెంట్లు, అతి తెలివి ప్రదర్శించే పోస్టులకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. ట్విట్టర్ ఖాతా లేని హీరోయిన్‌గా ఆమెపై ముద్ర పడింది. కాకపోతే ఇన్స్‌టాగ్రామ్‌లో 50 లక్షల ఫాలోవర్స్, ఫేస్‌బుక్‌లో 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం ఓ రికార్డు.

Also Read: లిప్ లాక్ అనగానే సూర్య భయపడ్డాడు… కాజల్ అగర్వాల్

After Nishabdham, Anushka Shetty to team up with director Mahesh P? |  Telugu Movie News - Times of India

సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించకపోవడానికి

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి డాన్స్ …

Anushka Shetty and Rana Daggubati celebrate 3 years of Baahubali 2 |  Filmfare.com

సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించకపోవడానికి కారణం నా వ్యక్తిగత స్వభావమే. నాకు కొత్త వారితో కలిసి పోవడమంటే కష్టమైన పని. ఫిల్మ్ సెట్స్‌లోకి వెళ్లితే అందరితో కలిసిపోతుంటాను. సినిమా ప్రపంచంతోనే కాలం గడిచిపోతుంటుంది. సోషల్ మీడియా వరకు వస్తే నాకు టైమ్ ఉండదు. అంతగా గుర్తు కూడా ఉండదు అని అనుష్క చెప్పారు.వాస్తవానికి నాకు సిగ్గు ఎక్కువ. కొత్తవారితో మాట్లాడటానికి మొహమాట పడుతుంటాను. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను. ట్విట్టర్‌లో చేరమని చాలా మంది చెప్పినా ఎందుకు సాధ్యం కావడం లేదు. మనకు తెలియని వారితో ఛాటింగ్ చేయాలన్న, వారితో భావాలు పంచుకోవాలన్న నాకు సరిపడదు. అందుకే వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటాను అని అనుష్క చెప్పారు.

Also Read: పవన్‌ కళ్యాణ్‌కు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!