Cold Shower Vs. Hot Shower

Shower :  నిజానికి ఏ నీటితో స్నానం చేయ‌డం మంచిది? చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డ‌మా? వేడినీళ్ల‌తోనా? అంటే.. వ్యక్తి యొక్క శరీర రకాన్ని బట్టి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, వేడి నీరు కళ్ళు మరియు జుట్టుకు హానికరం కాబట్టి శరీరాన్ని మరియు తలకు చల్లటి నీటిని శుభ్రపరచడానికి వాడాలి.ఇది కూడా ఒక శరీరం యొక్క ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో అధిక వేడి ఉన్న వ్యక్తి ఉండాలి వారి శరీరం కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నీటితో స్నానం మంచిది. చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డ‌మా? వేడినీళ్ల‌తోనా? అంటే.. చ‌న్నీళ్లే(Shower )బెట‌ర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చ‌న్నీళ్ల‌తో స్నానం(Shower )ఎప్పుడు

చ‌న్నీళ్ల‌తో స్నానం చేసేప్పుడు మొద‌ట ఇబ్బందిగా అనిపించినా.. ఒంటిపై చ‌న్నీళ్లు ప‌డ‌గానే శ‌రీరం మొత్తం ఉత్తేజిత‌మ‌వుతుంది. దెబ్బ‌కు నిద్ర‌మ‌త్తు వ‌దిలిపోతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండ‌గ‌లుగుతారు. అందుకే వేడినీళ్ల కంటే చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు. అంతేకాదు చ‌న్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల ముఖ అందం కూడా రెట్టింపు అవుతుందంట‌.చ‌న్నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న‌ చిన్న చిన్న రంధ్రాలు త‌గ్గిపోతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మొహంపై ఉన్న రంధ్రాలు త‌గ్గ‌డ‌మే కాకుండా మొహం తాజాగా మారుతుంది. దీంతో అందంగా కనిపిస్తారు.

వేడి నీటి స్నానం ఎప్పుడు

రాత్రిపూట వేడినీటితో స్నానం చేయ‌డం మంచిది. గోరువెచ్చ‌టి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరం, కండ‌రాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. దీనివ‌ల్ల పొద్దుట్నుంచి ప‌నిచేసి అల‌సిపోయిన శ‌రీరానికి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. హాయిగా నిద్ర‌ప‌డుతుంది. కాబ‌ట్టి రాత్రిపూట మాత్రం చ‌న్నీళ్ల కంటే వేడినీటితో స్నానం చేయ‌డ‌మే బెట‌ర్‌.

చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం అంద‌రికీ మంచిది కాదు. కొంత‌మంది సైన‌స్‌, మైగ్రేన్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఉంటారు. చ‌లికాలంలో చ‌న్నీటితో స్నానం చేస్తే వారి స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది. త‌ల‌ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌ట‌మే కాకుండా త‌ల‌నొప్పి కూడా పెరుగుతుంది. కాబ‌ట్టి వాళ్లు చ‌లికాలంలో వేడినీటితో స్నానం చేయ‌డ‌మే మంచిది. అదే వేస‌వి కాలంలో వాతావ‌ర‌ణం వేడిగా ఉంటుంది కాబ‌ట్టి ఎవ‌రైనా చ‌న్నీటితో స్నానం చేయొచ్చు.

సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.

Also Read : తిప్పతీగ ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *