soft feet home remedy

Soft Feet  : కాలం ఏది అయిన పాదాల పగుళ్లు మనకు ఇబ్బంది కలిగిస్తాయి .అయితే మన పాదాల పగుళ్లు కాపాడడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తూనే ఉంటారు, పగుళ్లు ఏర్పడిన పాదాలు( Soft Feet )కు ఆహారం మరియు సరికాని రకాల పాదరక్షలు ధరించడం వల్ల కావచ్చు. అయితే చిన్న చిన్న చిట్కాలతో వాటిని సులభంగా దూరం చేసుకోవచ్చు. పాదాల పగుళ్లు పోవాలంటే ఇలా చేయాలి. Also Read : అందమైన మెరిసే జుట్టు కోసం 5 చిట్కాలు

అరటిపండు : అరటిపండ్లను మెత్తగా చేసి పాదాలకు( Soft Feet) రాయాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల పాటు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.

ఒక టబ్‌లో కొన్ని గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు తేనె వేయాలి. అందులో పాదాలు( Soft Feet) పెట్టి ఇరవై నిమిషాల పాటు నెమ్మదిగా పాదాలపై మర్దన చేయాలి. తరువాత పాదాలను పొడిగుడ్డతో తుడిచి మాయిశ్చర్‌ రాసుకోవాలి.

గోరువెచ్చని నీటిలో పావుగంటపాటు పాదాలను పెట్టి తరువాత పొడిగుడ్డతో తడుచుకోవాలి. తరువాత ఒక టీస్పూన్‌ వ్యాజిలైన్‌లో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి పాదాలకు రాసుకుని సాక్స్‌ ధరించి పడుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు దూరమవుతాయి.

పాదాలను గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పెట్టాలి. తరువాత రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, ఒక టీస్పూన్‌ తేనె, నాలుగైదు చుక్కల వెనిగర్‌ను పేస్టులా చేసి పగుళ్లు ఉన్న చోట స్క్రబ్‌ చేయాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.

Also Read : ఆ కాకరకాయ తో ఆరోగ్యం మెండు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *