jayaprakash reddy popular dialogues

తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. ఆయన నటించిన సినిమాల్లోని ఆయన చెప్పే డైలాగులు యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి.అవి మీమ్స్ గా హల్‌చల్‌ చేస్తుంటాయి. ఎవరికైనా పంచ్‌లు వేయాలంటే ఎక్కువగా జయప్రకాష్‌రెడ్డి డైలాగులను వాడుతుండటం విశేషం. ఆయన చెప్పే డైలాగ్‌లు ఎంత పాపులరో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జయప్రకాష్‌ రెడ్డి చెప్పిన కొన్ని పాపులర్‌ డైలాగ్‌లేంటో ఓ లుక్కేద్దాం.

Telugu actor Jayaprakash Reddy dies of heart attack | Vijayawada News -  Times of India

Jaya Prakash Reddy (1946-2020): Mahesh Babu, Jr NTR, Prakash Raj and others  mourn demise of versatile actor | Entertainment News,The Indian Express

ఏమీ రా నోరు లెచ్చండాదే.

యాందిరా యాంజేస్తన్రా..

వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉందేమి రా.

ఒరేయ్‌ పులీ.. ఏమీరా నెత్తిన అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్‌.. బోడెమ్మ లెక్క

సీమ సందుల్లోకి రారా చూసుకుందాం.. నీ పతాపమో.. నా పతాపమో.

ఇది నా రాజ్యమే.. ఇక్కడ పగలేగానీ ప్రేమలుండవు.. కళ్లలేగానీ కనికరాలుండవు.