kajal aggarwal

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తో సినిమా చేస్తున్నాడు పవన్. క్రిష్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. పీరియాడిక్ స్టోరీతో ఈ సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ పవన్ సినిమా ఫిక్స్ అయ్యింది.ఆ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమాను పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధంచేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను అనుకుంటున్నారట. పవన్ తో కాజల్ మరో సారి జత కడుతుందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ నటించిన విషయం తెలిసిందే. మరి పవర్ స్టార్ – స్టైలిష్ డైరెక్టర్ కాంబోలో చందమామ కాజల్ నటిస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Also Read: రష్మీ గౌతమ్ న్యూ లుక్ అదుర్స్..