kajal aggarwal secretly engaged

తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన పోస్టు అందర్నీ ఆకర్షిస్తున్నది. నేను అనే పదం మనంగా మారితే ఇల్‌నెస్ (అనారోగ్యం) కూడా వెల్‌నెస్‌ (ఆరోగ్యం)గా మారుతుందని తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో కొద్దికాలంగా వినిపిస్తన్న పెళ్లి వార్తలకు బలం చేకూరాయి. దాంతో సినీ వర్గాలు ఆరా తీయగా.. సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్ జరిగిందనే దృష్టికి వచ్చింది. ఇలాంటి వార్తల నేపథ్యంలో కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం జరిగినట్టు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. తన తల్లిదండ్రులు చూసిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌తో నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి ఓ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హాజరయ్యారనే విషయం ప్రముఖ టెలివిజన్ వెల్లడించిన కథనంలో పేర్కొన్నారు. అయితే సీక్రెట్‌గా కుటుంబ వేడుకగా నిర్వహించినట్టు సమాచారం.

Also Read: బికినీ లో తేజస్వి గ్లామర్ ప్రజెంటేషన్

రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతోంది

కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం గురించి కుటుంబ సభ్యులు పెద్దగా స్పందించడం లేదు. మీడియా ఈ విషయం గురించి వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా సమాధానం దాటవేశారనే విషయం స్పష్టమైంది. అయితే సినీ వర్గాలు కాజల్ ఎంగేజ్‌మెంట్‌ను ధృవీకరిస్తున్నాయి.ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్2 చిత్రంలో కమల్ హాసన్ సరసన నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, మంచు విష్ణుతో మోసగాళ్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక హిందీ క్వీన్ రీమేక్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది కాకుండా కాజల్ బాలీవుడ్ సినిమా, వెబ్ సిరీస్‌పై దృష్టిపెట్టినట్టు సమాచారం.