manchu lakshmi supports rhea chakraborty

https://www.photojoiner.net/image/bAKxG9RD

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసులో అంద‌రి వేళ్లు అత‌ని ప్రియురాలు, న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి వైపే చూపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి మంచు ల‌క్ష్మి రియాకు మ‌ద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జ‌ర‌గాల‌ని వాదిస్తున్నారు. “రియా చ‌క్ర‌వ‌ర్తిని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ చేసిన‌ ఇంట‌ర్వ్యూ మొత్తం చూశాను. ఆ త‌ర్వాత‌ దీనిపై స్పందించాలా? వ‌ద్దా? అని చాలా ఆలోచించాను. కానీ ఇప్ప‌టికే మీడియా ఆమెను రాక్ష‌సిగా చిత్రీక‌రిస్తోంది. చాలామంది దీనిపై మౌనంగా ఉన్నారు. నాకు నిజం ఏంటో తెలీదు, కానీ నిజాన్ని తెలుసుకోవాల‌నుకుంటున్నాను. అదే స‌మ‌యంలో నిజం ఎలాగైనా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నా. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ర‌కాల‌ ద‌ర్యాప్తు సంస్థ‌లు సుశాంత్‌కు న్యాయం తీసుకువ‌చ్చేందుకు పాటుప‌డుతున్నాయి.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి డాన్స్ …

ఇత‌రుల‌ను ద్వేషించ‌డం మానుకోవాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె కుటుంబానిపై నింద‌లు వేయ‌డం త‌గ‌దు. మీడియా వ‌ల్ల ఆమె కుటుంబం ఎంత బాధ‌ప‌డుతున్నారనేది నేను అర్థం చేసుకోగ‌ల‌ను. నాకు కూడా ఇలాంటివి ఎదురైతే ఒక్క‌సారైనా నా స‌హ‌చ‌రులు నావైపు నిల‌బ‌డాలి. నిజం బ‌య‌ట ప‌డేంత‌వ‌ర‌కు ఆమెను ఒంట‌రిగా వ‌దిలేయండి. నేను ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తున్నాను” అని పేర్కొన్నారు. దీనికి రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ స్పందిస్తూ ‘గొప్ప‌గా చెప్పారు’ అని ట్వీట్ చేశారు.