Mangli

Mangli  : తీన్మార్ అనే ఓ టీవీ కార్యక్రమం ద్వారా పరిచయమై ఇప్పుడు సినిమాల‌లో దుమ్ము రేపుతున్న సింగ‌ర్ మంగ్లీ. యూనిక్ వాయిస్‌తో మంచి సింగ‌ర్‌గా దూసుకుపోతున్న మంగ్లీ ఎప్పుడు ట్రెడిష‌న‌ల్ లుక్‌లోనే క‌నిపిస్తూ ఉంటుంది. కాని తాజాగా ఈ అమ్మ‌డు డ్రెస్ సైజ్‌ని కాస్త త‌గ్గించి నెటిజ‌న్స్‌కి షాకిచ్చింది. మంగ్లీని గ‌తంలో ఎప్పుడు ఇలా క‌నిపించ‌లేదు.బిగ్ బాస్ షో కోసం మంగ్లీ ఇలా నెటిజ‌న్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తుందా అంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

Mangli

మంగ్లీ బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ అమ్మ‌డి న్యూ లుక్ అభిమానుల‌లో అనేక అనుమానాలు క‌లిగిస్తుంది. అయితే ప్రస్తుతం సినీ నేపథ్య గాయనిగా చాలా బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో ఆమె బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెడుతుందా అనే అనుమానాలు లేక‌పోలేదు. మంగ్లీ రీసెంట్‌గా పాడిన సారంగ‌ద‌రియా పాట ఎంత సెన్సేష‌న్ సృష్టిస్తుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Also Read : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధ‌నుష్ మూవీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *