nivetha thomas about negative roles

V చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకొన్నారు.నానితోపాటు సుధీర్ బాబు, పోసాని మురళీ కృష్ణ, నివేదా థామస్, అదితి రావు హైదరీ తదితరులు నటించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ మీడియాతో జూమ్ ద్వారా మాట్లాడారు.నేను నటించే ఏ చిత్రంలోనైనా అందరూ బాగా నటించాలి. అందరికీ పేరు రావాలని కోరుకొంటారు. అదే విధంగా అదితి రావు హైదరీ అద్భుతమైన నటి. ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉన్నాయా? లేవా అనే విషయాలు తెరపైన చూడాల్సిందే. అదితి రావు, నానీ, సుధీర్ బాబు అందరి పాత్రలు హైలెట్ అవుతాయి. ఫెర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న పాత్రలు తెరపైన కనిపిస్తాయి అని నివేదా థామస్ తెలిపారు.

Also Read: బిగ్ బాస్ ఫేమ్ వితికా శేర్ లేటెస్ట్ ఫొటోస్

Also Read: కృష్ణం రాజు గారి చేపల పులుసు..

నాని నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తారనే అందరికి తెలిసిందే. నాని తన పాత్రలో అద్భుతంగా ఉన్నారనేది వాస్తవం. సినిమా రిలీజ్ తర్వాత నాని ఏంటో మరోసారి తెలుస్తుంది. నాకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించాలని ఉంది. మంచి పాత్రలు వస్తే తప్పుకుండా చేస్తాను. స్టార్‌గా కంటే నటిగా అందరికి గుర్తుండిపోవాలనుకొంటాను. నటిగా హీరోయిన్ పాత్రలే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాలన్నది నా ఉద్దేశం అని నివేదా థామస్ పేర్కొన్నారు