One Year For Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్హీరోయిన్ గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సాహో” ఏడాది పూర్తి చేసుకుంద. బాహుబలి కోసం ప్రభాస్ అభిమానులు ఎంతలా ఎదురు చూసారో వారికే తెలుసు. దీనితో ఈ సినిమా కోసం వారి టెన్షన్ ఒకసారి పీక్స్ కు కూడా వెళ్ళిపోయింది. దీనితో వారిని ఉద్దేశించి వారి ఏఈ చిత్రం టీజర్ లో డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ఒక సీన్ ల కూడా ప్రభాస్ చెప్పాడు.

Also Read: విలన్‌ పాత్రలకు సై … నివేదా థామస్

ఇప్పుడు అదే డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రచ్చ లేపుతుండగా వారికోసం ప్రభాస్ ఒక పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టారు. “నా డై హార్డ్ ఫ్యాన్స్ మరియు నా చిత్ర యూనిట్ కు సాహో 1 సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా” అని ప్రభాస్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తో ఇపుడు ప్రభాస్ అభిమానులకు మరింత బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే ఇదే పోస్ట్ తో పాటు ఒక స్టన్నింగ్ లుక్ ను కూడా సాహో నుంచి ఇప్పటి వరకు చూడని దానిని కూడా వదిలారు.