pragathi dance video

వెండితెరపై తల్లిగా, అక్కగా, వదినగా అలరిస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ప్రగతి.. 44 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేసి రచ్చ చేస్తోంది. దీంతో ఈమెకు సంబంధించిన అన్ని వర్కవుట్ వీడియోలకు సోషల్ మీడియాలో యమ గిరాకీ నెలకొంది. అందుకు తగ్గట్లుగా ఆమె కూడా రెచ్చిపోతుండటంతో నెటిజన్లకు కావాల్సినంత ట్రీట్ లభిస్తోంది. లుంగీ కట్టి తీన్మార్ స్టెప్పులేయాలన్నా, కిక్ బాక్సింగ్ చేయాలన్నా, క్లాసికల్ డాన్స్ వేయాలన్నా అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తోంది ప్రగతి.

Also Read: ఎర్రచీరలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్

ఐశ్వర్యారాయ్ పాటకు స్టెప్పులేసి యమ అట్రాక్ట్ చేసింది ప్రగతి. ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తన ఎనర్జీతో ఆశ్చర్యపర్చింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.