priyamani

సౌత్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ ఉత్తమనటి ప్రియమణి. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడమే కాకుండా, గ్లామర్‌గానూ తన సత్తా చూపించిందీ భామ. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గుడ్‌బై చెప్పిన ప్రియమణి, ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీకి రెడీ అయింది. టాలీవుడ్‌లో అనేకానేక కథలు వినిపిస్తున్నాయి. కానీ ప్రియమణికి మాత్రం అదృష్టం మాములుగా లేదు. పెళ్లి తర్వాత కూడా ఆమెకు మంచి మంచి పాత్రలు వస్తుండటం విశేషం.

Also Read: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న .. ప్రగ్యా జైస్వాల్

Also Read: దేవదాసి నాగరత్తమ్మ కథతో…సమంత.

అయితే ప్రస్తుతం ప్రియమణి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న నారప్ప సినిమాలో నటిస్తుంది. మరోవైపు దగ్గుబాటి రానా హీరోగా వస్తున్న విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్క గా కనిపించనుంది. ఈ రెండు చిత్రాలే కాకుండా కన్నడ బాలీవుడ్లో కూడా సినిమాలు తీస్తోంది . ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో కూడా ప్రియమణి నటిస్తుంది. అయితే తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది ప్రియమణి. కొటేషన్ గ్యాంగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. పెళ్లి తర్వాత ప్రియమణి వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉందని చెప్పాలి.

Also Read: యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక సోయగాలు…