Priyamani

Priyamani : తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి, ఆతర్వాత చానాళ్ళ పాటు తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించింది. ఇక ఈ భామ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయింది. ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రియమణి ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలతో బిజీ అవుతోంది.

Image

 

ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పెళ్లయ్యాక తాను కాస్త బరువు పెరగడంతో అందరూ తనను ఆంటీ అని బ్లాకీ అని ఓల్డ్ అని రకరకాల కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. పెళ్లయ్యాక కాస్త బరువు పెరగడంతో చాలా మంది తనను బోండాం అని లావుగా ఉన్నావ్ అని కామెంట్ చేయడం తాను చూశానని చెప్పుకొచ్చింది. అలా అన్న వాళ్లు ఇప్పుడు మళ్లీ సన్నగా అయ్యావు అని చెబుతున్నారని అసలు మరొకరి శరీరం గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయని ఆమె ప్రశ్నించింది.

Also Read : మరోసారి ట్రోలర్స్ కి దొరికిపోయిన రోజా

 

Image

 

ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రానా హీరోగా రిలీజ్ అవుతున్న విరాటపర్వం సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక హిందీలో కూడా అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కబోతున్న మైదాన్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది.

Also Read : పెళ్లిపై తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *