renu desai

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల కోసం తన మనసుకు నచ్చిన కొన్ని విషయాలు షేర్ చేస్తుంటారు.. 16 ఏళ్ల వయసులో అనుకోకుండా కెమెరా ముందుకు వచ్చానని ఆ రోజును గుర్తు చేసుకున్నారు.

Also Read: రష్మీ గౌతమ్ న్యూ లుక్ అదుర్స్..

 

`1995, సెప్టెంబర్ 9.. నేను మొదటిసారి కెమేరా ముందుకొచ్చి పాతికేళ్లు పూర్తయ్యాయి. అంతరిక్ష శాస్త్రవేత్త లేదా డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. కానీ, విధి నా జీవితాన్ని వేరే విధంగా ప్లాన్ చేసింది. 16 ఏళ్ల వయసులో అనుకోకుండా నేను కెమేరా ముందుకు రావాల్సి వచ్చింది. అప్పడే సినిమాలతో ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాసాలో జాయిన్ అయి శాస్త్రవేత్త కావాలనుకున్న నా కలను వదులుకోవాల్సి వచ్చినపుడు చాలా బాధపడ్డాను. చాలా సంవత్సరాలు ఆ బాధ నన్ను వెంటాడింద`ని రేణు పేర్కొన్నారు.