roja about experience with chiranjeevi

చిరంజీవితో సరితూగే గ్లామర్ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రోజా ఒకరు. రోజా-చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే అందులో వీరిద్దరిపై చిత్రీకరించిన పాటలు, వేసిన స్టెప్పులు మరో ఎత్తు. వినాయక చవితి సందర్భంగా 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే స్పెషల్ ప్రోగ్రాం ప్రసారమైన సంగతి తెలిసిందే.ఆ వేడుకలో భాగంగా రోజా నాటి సంగతులను గుర్తు చేసుకుంది.

Also Read: హిందూపూర్ కోవిడ్ సెంటర్‌కు బాలయ్య భారీ విరాళం

Image

(Image: Twitter)

ముఠామేస్త్రీ సినిమా షూటింగ్ విశేషాలను రోజా చెబుతూ.. చిరంజీవితో నటించడం, డ్యాన్సులు చేయడం చాలా కష్టం, జాగ్రత్తగా వ్యవహరించమని సెట్‌లో అందరూ భయపెట్టారు. అయితే అలా చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు.. ఎంతో సింపుల్‌గా వచ్చి మాట్లాడారు. మొదటి రోజే సాంగ్ షూట్.. అది కూడా ఎంత ఘాటు ప్రేమయో అనే పాట. ఆ పాట ఎంతో పేరును తీసుకొచ్చిందని తెలిపింది.చిరంజీవితో నాకు రొమాంటిక్ సాంగ్స్, ఈలలు వేసే మాస్ సాంగ్ కూడా పడ్డాయి. అదే సినిమాలో మామా మామా అనే మాస్ సాంగ్ ఓ రేంజ్‌లో హిట్టయింది. ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి దీక్షలో ఉన్నారు.. రొమాంటిక్ షాట్ చేసేందుకు సిగ్గుపడ్డారు. ఇక అదే దొరికిన ఛాన్స్ అని నేను రెచ్చిపోయాను అందుకే ఆ సాంగ్‌లో పోటాపోటీగా నటించాను అని రోజా చెప్పుకొచ్చింది.