samyuktha hegde public workouts viral

నిఖిల్ `కిర్రాక్ పార్టీ` హీరోయిన్ సంయుక్తా హెగ్డే శుక్రవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లినప్పుడు ఒక సామాజిక కార్యకర్త ఆమెను ప్ర‌శ్నించ‌డంతో గొడ‌వ‌ప‌డింది. ఇక ఈ సీన్ లో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అక్క‌డ ర‌చ్చ ర‌చ్చ‌య్యింది. స‌ద‌రు సామాజిక క‌ర్త క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చి కొట్టింద‌ని డీఫేం చేసేందుకు ప్ర‌య‌త్నించింద‌ని సంయుక్త ఆరోపించారు. త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి పార్క్ లో వ‌ర్క‌వుట్లు చేస్తుంటే ఆ ఇద్ద‌రినీ ఆమె కొట్టార‌ని కూడా ఆ వీడియోలో ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే వీళ్లంతా చెమట నిండిన చొక్కాలను తీసివేసి స్పోర్ట్స్ బ్రాలతో ప‌బ్లిక్ పార్క్ లో వ్యాయామం చేయడాన్ని స‌ద‌రు సామాజిక కార్య‌క‌ర్త ఖండించారు. ఇక ఆ ఇరువ‌ర్గాల బాహాబాహీల‌కు సంబంధించిన వీడియోలు అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. ప‌బ్లిక్ లో ఈ ర‌చ్చంతా సాగుతుండ‌డంతో అక్క‌డ గుంపులుగా జ‌నం పోగ‌వ్వ‌డం ఆ వీడియోల్లో క‌నిపిస్తోంది. ఇక సంయుక్త హెగ్డే పెద్ద పెద్ద అరుపుల‌తో లైవ్ ని ఫోన్ ద్వారా ప్ర‌సారం చేయ‌డంతో ఈ గొడ‌వ పెద్ద‌దే అని అర్థ‌మ‌వుతోంది.

Also Read: అడవుల్లో తెగ కష్టా పడుతున్న రకుల్ ప్రీత్

Samyukta Hegde: I was abused and assaulted in daylight

ఇక ఈ గొడ‌వ‌లో సంయుక్త తన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపకపోవడంతో పోలీసులు ఆమెను సమీప పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. స్టేషన్ నుండి మళ్ళీ ఆమె ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించ‌డంతో ఇన్ స్పెక్టర్ లైవ్ ని ఆపమని ఆమెను బెదిరించ‌డం వీడియోలో క‌నిపిస్తోంది. ప‌బ్లిక్ ప్లేసులో నిఖిల్ హీరోయిన్ సంయుక్త చేసిన ర‌చ్చ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.

https://www.instagram.com/tv/CEtwP4plMhN/?utm_source=ig_embed