sanjjanaa galrani drug scandal

బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా ఆందోళన వ్యక్తమవుతుంటే.. మరో పక్క కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్ బయటకు రావడం సంచలనం రేపుతున్నది. సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరుగుతోందని, డ్రగ్స్ లేని పార్టీలు లేవంటూ వస్తున్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు మెల్లగా కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాహుల్‌తో పాటు ఈ వ్యవహారంలో సంజన పాత్ర ఏ మేర ఉందనే దానిపై ఫోకస్ పెట్టి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సంజనకు సమన్లు జారీ చేశారని సమాచారం. అయితే తాజాగా దీనిపై స్పందిస్తూ ఆవేదన చెందింది సంజన.

Also Read: డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఊగిపోతోంది.. మాధవీలత షాకింగ్ కామెంట్స్

Also Read: విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్‌

మీడియా ప్రతినిధులు పదేపదే కాల్స్ చేస్తూ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై ప్రశ్నల దాడి కురిపిస్తున్నారని, అందుకే తాను మీడియాకు దూరంగా ఉంటున్నా తప్పితే భయంతో కాదని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది సంజన. ఈ వ్యవహారంలోకి తనను అన్యాయంగా లాగుతున్నారని పేర్కొంటూ ఆమె ఆవేదన చెందింది.