sunny leone new car viral

సన్నిలియోన్‌ అందరకి తెలిసిన పేరు . తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇక టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాల్లో మెరిసింది సన్ని. కాగా.. సన్నికి ఓ తీరని కోరిక ఉందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ కలని ఈ మధ్యనే నిజం చేసుకుందట. ఈ విషయాన్ని సన్ని లియోన్‌నే స్వయంగా చెప్పింది. కరోనా విజృంభిస్తుండడంతో.. తన అత్తగారి బాగోగులు చేసుకోవడానికి సన్ని లాస్‌ ఏంజిల్స్ వెళ్లింది. ప్రస్తుతం అక్కడే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లలో మసెరటీ లీవెంటే బ్రాండ్‌ ఒకటి. ఈ కారు అంటే సన్నికి చాలా ఇష్టమట. దీని ఖరీదు కోటీ 45లక్షల రూపాయాలు. తాజాగా ఈ కారును కొని తన కోరికను తీర్చుకుంది.

`నిన్ననే ఇంటికి తీసుకొచ్చాను. ఈ కారును నడిపిన ప్రతిసారీ నేను చాలా సంతోషంగా ఉన్నాను` అని ఇన్ స్టాలో మసెరటితో మెరిసిపోతున్న ఫొటోని షేర్ చేసింది సన్నీ. ప్రస్తుతం సన్ని షేర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.