vidyullekha raman engagement

టాలీవుడ్ లో  ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలు తమ తమ ఇష్ట సఖులను పెళ్లాడగా.. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కంప్లీట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది. ఇదే బాటలో లేడీ కమెడియన్ . సౌత్ లో లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తెలియనివారుండరు. తన భిన్నమైన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తమిళ, తెలుగు భాషలలో అనేక సినిమాలో నటించిన ఈ లేడీ కమెడియన్ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఫిట్నెస్ ట్రైనర్ మరియు న్యూట్రిషన్ అయిన సంజయ్ తో ఆమె నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. వీరు కొద్దికాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. చెన్నైలో ఆగస్టు 26న ఈ వేడుక జరుగగా కేవలం మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యాట.

తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. తండ్రి వలె కెమెరా ముందు సత్తా చాటిన ఆమె పలు తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి హాస్యం పండించింది. రీసెంట్‌గా ఆమె ”విశ్వమిత్ర, అర్జున్ సురవరం, వెంకీ మామ, మత్తు వదలరా” సినిమాల్లో కనిపించింది.