Schools Reopen

కేంద్ర ప్రభుత్వ కరోనా రూల్స్‌ని అలాగే పాటిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. తాజాగా అన్‌లాన్ 4 మార్గదర్శకాల్ని అనుసరించి, ఏపీ వైసీపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి స్కూళ్లను తెరిచేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది. కరోనా కంటైన్‌మెంట్లలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో స్కూళ్లు నేడు తెరచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లను మాత్రమే తెరవాల్సి ఉంది. వీటిలో ఆన్‌లైన్ టీచింగ్, టెలీ కౌన్సెలింగ, విద్యా వారధి వంటి కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరు కావచ్చు. 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులు ఇళ్లదగ్గరే ఉంటూ ఆన్‌లైన్‌లో చదువుకోవాల్సి ఉంటుంది. 9 నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, టీచర్లు, ప్రిన్సిపల్స్ అందరూ మాస్కులు ధరించాలి, సేఫ్ డిస్టాన్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 30 వరకు… 9-12 తరగతుల విద్యార్థుల చదువుల వివరాల్ని విద్యాశాఖ తెలిపింది.

Andhra Pradesh government decides to form panels to regulate fees as schools  reopen- The New Indian Express