CM Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వరుస విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి విగ్రహాలు పగలగొడితే ఎవరికి లాభం? మతాల మధ్య చిచ్చు పెడితే ఎవరికి ఉపయోగం? ఎవరిని టార్గెట్‌ చేసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy is under fire over continued incidents of desecration of Hindu gods.

‘దేవుడి విగ్రహాలతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు. కలియుగం క్లైమాక్స్‌ అంటే ఇదేనేమో? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రతిసారీ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆలయాలు ధ్వంసం చేస్తూ సంక్షేమ పథకాలకు ప్రచారం రాకుండా చేశారు. తొమ్మిదిసార్లు ప్రభుత్వ పథకాల ప్రారంభ సమయంలోనే చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రారంభించే ముందు రోజే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది పొలిటికల్‌ గెరిల్లా వార్‌. 20వేల ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టాం. మారుమూల ప్రాంతాల్లో అర్ధరాత్రే దాడులు చేస్తున్నారని’ జగన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *