ayodhya ram temple bhoomi puja

నరేంద్ర మోదీ… అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో శిలాపూజ, భూమిపూజ, కర్మ శిలాపూజల్లో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఉదయం 11.30కు అయోధ్య చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి మోదీ కిందకు దిగగానే… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. అధికారిక ప్రకటన ప్రకారం… అసలైన భూమిపూజ మధ్యాహ్నం 12.44కి మొదలై… 12.45లోపలే ముగుస్తుంది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అందువల్ల అది 32 సెకండ్లలో పూర్తి కావాల్సి ఉంది. అంత తక్కువ సమయంలోనే పూర్తయ్యే ఆ మధుర క్షణాల కోసం కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు.

Image

ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… 40 కేజీల వెండి ఇటుకను… పునాదిరాయిగా వెయ్యనున్నారు. దాంతో… రామాలయ నిర్మాణం ప్రారంభమైనట్లే. ఈ రామాలయాన్ని నిర్మిస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. 1990 నుంచి ఇందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి దేశ ప్రజల్లో ఈ డిమాండ్ నానాటికీ పెరుగుతూ వచ్చింది. భూమి పూజ కార్యక్రమంలో భాగంగా… ప్రధాని మోదీ అయోధ్యలో దాదాపు 3 గంటలు ఉంటారు.

Image

Image