balakrishna donation

హిందూపూర్ ఎంఎల్ఎ, హీరో నందమూరి బాలకృష్ణ హిందూపుర్ కరోనా కేర్ సెంటర్ కు రూ.50 లక్షల విరాళం అందించి తన మంచి మనస్సును చాటుకున్నారు. కరోనా యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగించే పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు పెద్ద ఎత్తున అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో తన నియోజక వర్గంలో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేస్తున్న బాలకృష్ణ.. తాజాగా హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

Balakrishna Donates 55Lakhs To Corona Care Centre

ఈ మేరకు కరోనా వైరస్ నివారణకై ఉపయోగించే మందులు, కావాల్సిన పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర అన్ని పరికరాలను అందించడానికి ఈ విరాళాన్ని ప్రకటించారు బాలకృష్ణ. కాగా ఈ కల్లోల పరిస్థితుల్లో సినీ కార్మికుల కోసం ‘సీసీసీ మనకోసం’ అందించిన సాయం లోనూ భాగం పంచుకున్న బాలయ్య బాబు గతంలో 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కరోనాపై పోరాటటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున అందించారు బాలయ్య.