balasubrahmanyam health update

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగవుతోంది. ఆయన తనయుడు ఎస్పీ చరణ్.. బాలు ఆరోగ్యంపై తాజా ప్రకటన విడుదల చేశారు. కరోనా పరీక్షల్లో తన తండ్రికి నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మరిన్ని వివరాలు తెలుపుతామని ప్రకటనలో పేర్కొన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు, అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. కరోనా పాజిటివ్‌లు

bala subramanyam | TrendingScroll

ఎస్పీ బాలసుబ్రహ్మణం కరోనా సోకి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నై ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. ఇక ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు.