blue snake

లేత నీలి రంగులో ఉండే ఈ పాము పేరు బ్లూ పిట్‌ వైర్‌. దీనిని ‘లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌’ అనే అకౌంట్‌ నుంచి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూస్తుంటే ఓ తోటలో చెట్టుకున్న గులాబీ పువ్వును వాటేసుకొని చక్కగా అతుక్కుపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాముకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏకంగా రెండు మిలియన్ల వ్యూవ్స్‌ సంపాదించింది. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ పాముపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో ముద్దుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పైకి కనిపించే అంతా సాఫ్ట్‌ కాదట ఈ పాము. ఇది అత్యంత విషపూరితమైనది. అంతే కాక ప్రాణాంతకమైన ఈ పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవుతుంది. . పిట్‌ వైపర్‌ జాతీ పాములు సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇలా నీలం రంగులో ఉండటం అరుదు.